నిర్మాణ రంగంలో టెక్నాల‌జీ వినియోగం : నారాయ‌ణ‌

8 వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ప్ర‌క‌ట‌న

hellotelugu-PonguruNarayana

తిరుప‌తి : కీల‌క‌మైన నిర్మాణ రంగంలో టెక్నాల‌జీ వినియోగంపై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. సోమ‌వారం తిరుప‌తిలోని ఐఐటీలో జ‌రిగిన 8 వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. టెక్నాల‌జీలో రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఈ మేర‌కు నిర్మాణ రంగానికి కూడా దీనిని వ‌ర్తింప చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు నారాయ‌ణ‌. మంత్రికి ఘనస్వాగతం పలికారు ఐఐటీ డైరెక్టర్ కే ఎన్ సత్యనారాయణ,లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు ,ప్రొఫెసర్లు. ఐఐటీ లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించారు.

నిర్మాణ రంగంలో అనవసర ఖర్చు, సమయం తగ్గించటంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్ పని చేస్తోంద‌ని చెప్పారు పొంగూరు నారాయ‌ణ‌. ILCE చేస్తున్న‌ ప్రయత్నాలను అభినందిస్తున్నానని అన్నారు. లీన్ కన్స్ట్రక్షన్ పని విధానం తో నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో, మంచి నాణ్యతతో పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి మునిసిపల్, పట్టణాభివృద్ధిలో ఈ పని విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు మంత్రి . లీన్ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణ రంగ సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు. మున్సిపాల్టీల్లో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలు వాడుకొంటామని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఒకచోట మొదటగా ఫైలెట్ ప్రాజెక్ట్ చేపడతామని వెల్ల‌డించారు.

Exit mobile version