Popular Business Man Gift to Women Cricketers : మ‌హిళా క్రికెట‌ర్ల‌కు వ‌జ్రాల‌ ఆభ‌ర‌ణాలు

ప్ర‌క‌టించిన ప్రముఖ పారిశ్రామిక‌వేత్త

Hello Telugu - Popular Business Man Gift to Women Cricketers

Hello Telugu - Popular Business Man Gift to Women Cricketers

Women Cricketers : ముంబై : ఎన్నో ద‌శాబ్దాల క‌ల‌ను నెర‌వేర్చారు భార‌త క్రికెట్ కు చెందిన మ‌హిళా క్రికెట‌ర్లు. ఐసీసీ ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఫైన‌ల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేత‌లుగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగులు చేసింది. స్మృతీ మంధ‌న్నా 45 ర‌న్స్ చేస్తే, షెఫాలీ వ‌ర్మ 87 ర‌న్స్ రెచ్చి పోయింది. దీప్తి శ‌ర్మ 58 ర‌న్స్ తో అద‌ర‌గొట్టింది. ఇక జెమీమా, కౌర్ త‌క్కువ ప‌రుగులు చేసినా ఆక‌ట్టుకున్నారు.

అనంత‌రం 299 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 246 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. కానీ జ‌ట్టు కెప్టెన్ లారా సూప‌ర్ షో చేసింది. ఒక‌వేళ ఆమె గ‌నుక అవుట్ కాక పోయి ఉంటే సీన్ వేరేగా ఉండేది. స‌ఫారీ జ‌ట్టును అద్భుత‌మైన బౌలింగ్ తో దీప్తి శ‌ర్మ బోల్తా కొట్టించింది. త‌ను 5 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో 22 వికెట్లు తీసి విస్తు పోయేలా చేసింది. త‌ను టోర్నీ ఆఫ్ ది ప్లేయ‌ర్ గా నిలిచింది. ఇక ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటిన షెఫాలీ వ‌ర్మ , బౌలింగ్ లో కూడా రాణించింది. 2 వికెట్లు తీసింది. కోట్లాది మంది అభిమానుల‌ను సంతోష ప‌రుస్తూ భార‌త జ‌ట్టు విశ్వ విజేత‌గా నిలిచింది.

Popular Business Man Huge Gift to Women Cricketers

క‌ప్ గెలుచుకున్న సంద‌ర్బంగా అమ్మాయిల‌కు పెద్ద ఎత్తున న‌జ‌రానాలు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ చైర్మ‌న్ జే షా సూచ‌న మేర‌కు రూ. 51 కోట్లు ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు సూర‌త్ కు చెందిన బిజినెస్ మెన్ , రాజ్య‌సభ స‌భ్యుడైన గోవింద్ ధోలాకియా (Govind Dholakia) మ‌హిళా క్రికెట‌ర్ల‌కు వ‌జ్రాల ఆభ‌ర‌ణాలు, సోలార్ ప్యానెల్ లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ను శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు , చైర్మన్ ఎమెరిటస్ కు . ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆయన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) గౌరవ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు ఒక లేఖ రాశారు. ఈసంద‌ర్బంగా మన దేశానికి వారు తీసుకువచ్చే వెలుగు వారి జీవితాల్లో కూడా స్థిరంగా ప్రకాశిస్తూనే ఉంటుందన్నారు.

Also Read : CM Revanth Reddy Important Update on SLBC : ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ ప‌నులు ప్రారంభం

Exit mobile version