DSC Final Selection List Interesting : డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల

రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద‌ నియామక ప్రక్రియ

Hello Telugu - DSC Final Selection List Interesting

Hello Telugu - DSC Final Selection List Interesting

DSC : అమరావతి : ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తిచేసి, సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు.15 వేల 941 పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని, ఇందులో 49.9 శాతం మ‌హిళ‌లు, 50.1 శాతం పురుష అభ్య‌ర్థులు ఉన్నార‌ని చెప్పారు.

DSC Final List Released

ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా DSC-2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ 2024 జూన్ 13వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 27తో మొదలైందని చెప్పారు. ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వం అక్టోబర్ 2024లో రెండవసారిగా టెట్ పరీక్ష నిర్వహించిందని వివరించారు.

వందకు పైన కేసులు పెట్టినా ఏ ఆటంకం లేకుండా, విమర్శలకు తావు లేకుండా DSCని నిర్వహించామని, కేవలం 150 రోజుల్లో మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. డ్రాఫ్ట్ కీ పై లక్ష 40 వేల అభ్యంతరాలు వచ్చినా అన్నిటినీ సమర్ధంగా జవాబు ఇచ్చామని తెలిపారు. అభ్యర్థుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఏప్రిల్ 20, మే 15, 2025 మధ్య కాలంలో 3,36,300 అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ముఖ్యంగా 87 శాతం అభ్యర్థులు వారి మొదటి ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగిందన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6 నుండి జులై 2, 2025 వరకు రెండు షిఫ్టుల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో నిర్వహించామని తెలిపారు. ప్రాథమిక సమాధానాల కీ జులై 5న విడుదల చేసి, జులై 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి, నిపుణుల సమీక్ష తర్వాత ఆగస్టు 1న ఫైనల్ కీ ప్రచురించామని వివరించారు.

Also Read : Supreme Court Shocking Comments on Waqf : వ‌క్ఫ్ ఆస్తుల‌పై సీజేఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Exit mobile version