Nara Lokesh-PM Modi Important Meet : కీలక అంశాలపై ప్రధాని మోడీని కలిసిన మంత్రి లోకేష్

రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు...

Hello Telugu - Nara Lokesh-PM Modi Important Meet

Hello Telugu - Nara Lokesh-PM Modi Important Meet

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ & హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కేంద్రం పూర్తి సహకారం అందించాలని లోకేష్ కోరారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh Meet PM Modi

ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి అవసరమైన మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణల గురించి వివరించి, కేంద్రం సహాయంతో విద్యారంగ ఫలితాలను మరింత మెరుగుపరుచుకోవాలని అభిలషించారు.

గత 15 నెలల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్రం అందించిన సహకారానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విక్సిత్ భారత్ 2047 దిశగా రాష్ట్రం తన వంతు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగేలా జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను సాధ్యమైనంత మద్దతు ఇస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ “యోగ ఆంధ్ర” అనే కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధానికి అందజేశారు.

Also Read : Piyush Goyal Important Update : వినియోగదారులకే జీఎస్టీ తగ్గింపుల లాభాలు – పీయూష్ గోయల్

Exit mobile version