న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా

బంప‌ర్ మెజారిటీ క‌ట్టబెట్టినందుకు ధ‌న్య‌వాదాలు

hellotelugu-KomatiReddyVenkatReddy

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అపారమైన మద్దతు తెలుపుతూ అత్యధిక స్థానాల్లో గెలిపించిన నల్లగొండ ప్రజలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నల్లగొండ అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే నల్లగొండ అని మరోసారి ప్రజలు రుజువు చేశారని అన్నారు. ఈ సంద‌ర్బంగా భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టినందుకు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ వాసుల‌కు తాను ఎల్ల‌వేళ‌లా రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరంపర కొనసాగుతోందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. నల్లగొండ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలనకు మద్దతు లభించిందన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాదుకు ధీటుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు మంత్రి.

గెలుపొందిన అభ్యర్థులందరూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఓడిపోయిన వారు నిరుత్సాహ పడకుండా తమ డివిజన్ల సమస్యలను నా దృష్టికి తీసుకు రావాల‌ని కోరారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని అన్నారు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతామన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజా దర్బారు నిర్వహిస్తామన్నారు.

Exit mobile version