హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఆయన తన స్వరం మార్చారు. మొన్నటికి మొన్న తనకు టికెట్ల ధరల పెంచడం గురించి తెలియదన్నారు. తన వద్దకు ఆ ఫైల్ రానేలేదని చెప్పారు. ఆ ఫైల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకే వెళ్లిందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తీరా ఏమైందో ఏమో కానీ, ఆయన తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారారు. తన జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ మహిళతో ప్రేమాయణం జరుపుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏకంగా ప్రచురణ, ప్రసార మాధ్యమాలలో పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. దీనిపై నోరు మెదిపారు. ఆపై తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇదిలా ఉండగా మంత్రి కోమటి రెడ్డి మాట మార్చారు. సినిమా టికెట్ రేట్ల పెంపు నాకు తెలిసే జరుగుతుందన్నారు. ఒక్క రోజులోనే మాట మార్చడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. నిన్న సినిమా టికెట్ ధరల పెంపునకు తనకు సంబంధం లేదని చెప్పి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చించిన తరువాతే టికెట్ ధరలు పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు. రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి లాగా ఎవరి శాఖలో జోక్యం చేసుకోడంటూ కితాబు ఇవ్వడం విస్మయానికి గురి చేసింది. టికెట్ ధరల గురించి మేమందరం కలిసి కూర్చుని మాట్లాడిన తరువాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.















