CM Revanth Reddy Sensational Comments : జూబ్లీహిల్స్ లో ‘హ‌స్తం’ విజ‌యం ఖాయం

ధీమా వ్య‌క్తం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Sensational Comments

Hello Telugu - CM Revanth Reddy Sensational Comments

CM Revanth Reddy: హైద‌రాబాద్ : ఏం సాధించార‌ని బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ లో ప్ర‌జ‌లు ఓటు వేస్తారంటూ ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఆయ‌న మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ను, కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీశ్ రావుల‌ను ఏకి పారేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో విధ్వంసం త‌ప్పా వికాసం ఎక్క‌డ ఉంద‌ని నిల‌దీశారు సీఎం. సెంటిమెంట్ తో ప్ర‌జ‌ల ను మ‌భ్య పెట్టి ఓట్లు దండు కోవాల‌ని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇది మంచి ప‌ద్దతి కాద‌న్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లను తాను , త‌న పాల‌న‌కు రెఫ‌రెండంగా తీసుకోవ‌డం లేద‌న్నారు. అలా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు సీఎం.

CM Revanth Reddy Comments

విచిత్రం ఏమిటంటే ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు కూడా తన సొంత పార్టీకి ఓట్లు అడుగుతూ లేఖ ద్వారా లేదా వీడియో ద్వారా విజ్ఞప్తి చేయలేదన్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే బీఆర్ఎస్ ముందే ఓట‌మిని ఒప్పుకున్న‌ట్ల‌యింద‌న్నారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోవడం ఖాయమని తెలిసినందున కెసిఆర్ తన ఫామ్ హౌస్ నుండి ప్రచారం చేయడానికి బయటకు రాలేదని ఆయన అన్నారు. కెసిఆర్ లేకపోవడం, ఓటర్లకు సంక్షిప్త సందేశం కూడా విడుదల చేయడానికి నిరాకరించడం వల్ల కేటీఆర్, హ‌రీష్ రావులు ప్ర‌చారం చేశార‌ని ఎద్దేవా చేశారు. అందుకే ప్ర‌జ‌లు ప్ర‌జా పాల‌న అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరుకుంటున్నార‌ని జోష్యం చెప్పారు.

Also Read : Anupama Approached Police Sensational : పోలీసుల‌ను ఆశ్ర‌యించిన న‌టి అనుప‌మ

Exit mobile version