Palla Srinivasa Rao Warning : పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌దు : శ్రీ‌నివాస‌రావు

పార్టీ ముఖ్య నేత‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ

Hello Telugu - Palla Srinivasa Rao Warning

Hello Telugu - Palla Srinivasa Rao Warning

Palla Srinivasa Rao : అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నాయకులు, శ్రేణుల‌తో ఈరోజు మంగళగిరిలో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivasa Rao) మాట్లాడారు. కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి ఎవ‌రైనా , ఎంత‌టి స్థాయిలో ఉన్నా స‌రే ఊరుకునేది లేద‌న్నారు. పార్టీ లైన్ దాటి వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక జారీ చేశారు. క్రమశిక్షణతో పని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. 15వ తేది లోపు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ కమిటీల వరకు నియామకాలు పూర్తి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

TDP Chief Palla Srinivasa Rao Shocking Comments

ఏపీ కూటమికి చెందిన జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయకులతో సఖ్యతగా, సమిష్టిగా కలుపుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ‌రైనా స‌రే పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో ఇటీవ‌లే ఎంపీ, ఎమ్మెల్యేల మ‌ధ్య పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌ల ప‌ర్వం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస రావు సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు విజ‌య‌వాడ కేశినాని చిన్నిపై. త‌నకు టికెట్ ఇచ్చేందు కోసం రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడ‌ని, ఈ మేర‌కు కొన్ని కోట్లు తాను ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : Minister Nara Lokesh Important Update : ఏపీలో 406 జాబ్ మేళాలు : నారా లోకేష్

Exit mobile version