Kandula Durgesh : అమరావతి : మత్స్యకారుల వ్యాపార వృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై) ద్వారా దేశంలోని మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Minister Kandula Durgesh Key Comments on Fishermans
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఎఫ్ఎఫ్‌పీవో (FFPO)గా ఏర్పడిన కోరుమామిడి “ది వడ్డీస్ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ” కి యాజమాన్య ఖర్చుల నిమిత్తం రూ.2,54,000 చెక్కును అందించారు మంత్రి కందుల దుర్గేష్. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇదే ప్రథమం కావడం సంతోషంగా ఉందన్నారు. 100 మంది సభ్యులు ఉన్న సొసైటీలకు రెండు సంవత్సరాల కాలంలో రూ.5 లక్షలు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఈ నిధులు ఆఫీస్ నిర్మాణం, సిబ్బంది వేతనాలకు ఉపయోగ పడతాయని చెప్పారు మంత్రి.
ప్రతి మత్స్యకారుడు ఎన్ఎఫ్‌డీసీ (ఎన్ఎఫ్‌డీసీ)లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు కందుల దుర్గేష్, సొసైటీలో క్రమం తప్పకుండా డబ్బు జమ చేసుకుంటే, ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు, తద్వారా తక్కువ వడ్డీకి రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి.
Also Read : Popular Actress Tulasi Shocking Decision : సినిమాలకు విరామం సాయిబాబాకు అంకితం
