Minister Jupalli Shocking Comments : దుష్ప్ర‌చారంపై ప‌రువు న‌ష్టం దావా వేస్తా

నిప్పులు చెరిగిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Hello Telugu - Minister Jupalli Shocking Comments

Hello Telugu - Minister Jupalli Shocking Comments

Minister Jupalli : హైద‌రాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Minister Jupalli) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా కొంద‌రు కావాల‌ని త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ వాపోయారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై పని కట్టుకుని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. వికృత రాజకీయాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాన‌ని, ఆపై ప‌రువు న‌ష్టం దావా కూడా వేస్తాన‌ని ప్ర‌క‌టించారు జూప‌ల్లి కృష్ణారావు. ఆర్టీఐ ద్వారా కొన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అడిగించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచురించిన కథనాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Minister Jupalli Krishna Rao Shocking Comments

త‌న‌ పరువుకు భంగం కలిగించేలా, త‌న‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు ఉద్దేశ పూర్వకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు, వర్గాలు ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు జూప‌ల్లి కృష్ణారావు. అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించామ‌న్నారు.. ఆ వార్తను ప్రచురించిన సంస్థలు , సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న బాధ్యులైన వ్యక్తులపై పరువు నష్టం దావా దాఖలు చేస్తాన‌ని చెప్పారు. ప్రజాసేవకుడిగా నేను ఎల్లప్పుడూ ప్రజల మన్ననలు పొందే విధంగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పని చేస్తున్నానని చెప్పారు. త‌న‌కున్న‌ రాజకీయ ప్రస్థానం ప్రజల నమ్మకం మీదే నిలిచిందన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నా పేరు చెడగొట్టాలన్న ప్రయత్నాలు విఫలం కాక త‌ప్ప‌ద‌న్నారు.

Also Read : BJP MP Tejaswi Surya-DK Shivakumar Important Meet : డీకే శివ‌కుమార్ తో బీజేపీ ఎంపీ సూర్య భేటీ

Exit mobile version