BJP MP Tejaswi Surya-DK Shivakumar Important Meet : డీకే శివ‌కుమార్ తో బీజేపీ ఎంపీ సూర్య భేటీ

బెంగళూరులో ప్ర‌జా ర‌వాణా మెరుగు ప‌ర్చాలి

Hello Telugu - BJP MP Tejaswi Surya-DK Shivakumar Important Meet

Hello Telugu - BJP MP Tejaswi Surya-DK Shivakumar Important Meet

MP Tejaswi Surya : బెంగ‌ళూరు : ప్ర‌తి నిత్యం ఉప్పు నిప్పు లాగా ఉండే కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేత‌లు ఉన్న‌ట్టుండి ఒకే చోట స‌మావేశం కావ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య ఇవాళ క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు గంట‌కు పైగా సమావేశం జ‌రిగింది. స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడారు ఎంపీ తేజ‌స్వి సూర్య‌ (MP Tejaswi Surya). ఇది రాజ‌కీయ ప‌ర‌మైన స‌మావేశం కాద‌న్నారు. కేవ‌లం ప్ర‌జ‌లు ఎదుర్కొంట‌న్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తాను ప్ర‌స్తావించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌ధానంగా రోజు రోజుకు బెంగ‌ళూరు న‌గ‌రంలో ర‌ద్దీ పెరుగుతోంద‌న్నారు. ఈ రద్దీని తగ్గించడానికి, స్థిరమైన రవాణా పరిష్కారాలను అందించడానికి చ‌ర్య లు తీసుకోవాల‌ని తాను డీకే శివ‌కుమార్ ను కోరాన‌ని చెప్పారు.

BJP MP Tejaswi Surya Meet DY CM DK Shivakumar

ఇందుకు సంబంధించి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. తామిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం అర్ధ‌వంతంగా ముగిసింద‌న్నారు. పార్టీలు వేరైన‌ప్ప‌టికీ బాధ్య‌త క‌లిగిన ప‌ద‌వుల్లో ఉన్న వాళ్లం కాబ‌ట్టి త‌మ త‌మ లిమిట్స్ త‌మ‌కు ఉంటాయ‌ని చెప్పారు తేజ‌స్వి సూర్య‌. నగరంలో సమర్థవంతమైన రాకపోకల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని కోరాన‌ని అన్నారు. కార్-ఓన్లీ టన్నెల్ ప్రాజెక్టుకు ఖర్చు చేయడానికి ప్రతిపాదించబడిన డబ్బుల‌ను మెట్రో విస్త‌ర‌ణ‌కు వినియోగించాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వ సొంత డీపీఆర్ ప్రకారం సొరంగం రోడ్డులో గంటకు 1,800 వాహనాలు ప్రయాణించే ఛాన్స్ ఉంటుంద‌న్నారు.

Also Read : R Ashoka Shocking Comments : క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు ఖాయం : అశోక‌

Exit mobile version