Minister Gottipati Ravi Important Update : కాలుష్య నియంత్ర‌ణ కోసం రూ. 500 కోట్లు

మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న

Hello Telugu - Minister Gottipati Ravi Important Update

Hello Telugu - Minister Gottipati Ravi Important Update

Minister Gottipati Ravi : అమరావతి : ఎన్టీటీపీఎస్ కాలుష్యం నివార‌ణ‌పై ఫోక‌స్ పెడ‌తామ‌ని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. సోమ‌వారం అసెంబ్లీలో NTTPS కాలుష్యం, స్థానిక ప్రజల జీవనోపాధిపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి స‌మాధానం ఇచ్చారు. సంస్థ నుంచి వెలుబడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్ప‌ష్టం చేశారు మంత్రి. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు NTTPS లో మరమత్తులు చేపడుతున్నామ‌ని చెప్పారు. పాండ్ యాష్ అక్రమ నిల్వ చేసి తరలిస్తున్న కారణంగా స్థానికంగా కాలుష్యం జరిగేదన్నారు. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు సూచ‌న‌ల ప్ర‌కారం బూడిద తరలింపున‌కు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించిందని చెప్పారు.

Minister Gottipati Ravi Key Comments on Pollution Control

కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కోల్ స్టోరేజ్ షెడ్ ను నిర్మిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ (Minister Gottipati Ravi). కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు కాలుష్య నివారణకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామ‌ని వెల్ల‌డించారు. NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ లో భాగంగా కొత్త పరికరాలను అమర్చడం కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. టెండరింగ్ ఎజెన్సీ ద్వారా స్థానికుల జీవనోపాధి దెబ్బ తింటుందనేది అసత్య ప్రచారం మాత్రమేన‌ని పేర్కొన్నారు గొట్టిపాటి ర‌వికుమార్. NTTPS చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. స్థానిక ప్రజల త్యాగాలను విద్యుత్ శాఖ, జెన్కో ఎప్పటికీ మర్చిపోదన్నారు. బూడిద తరలింపు కోసం లోడింగ్ ఉచితంగా చేయడంతో పాటు రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంద‌న్నారు.

Also Read : Andaman Sea Oil Interesting : అండమాన్ సముద్ర భాగంలో భారీ చమురు నిక్షేపాలు

Exit mobile version