BC Janardhan Reddy : అమరావతి : ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన సాగిస్తోందని చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). ఈ 15 ఏళ్ల కాలంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకు వచ్చిన ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 10న అత్యంత ప్రతిష్టాత్మకంగా అనంతపురం వేదికగా టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ బంపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక కష్టాలను దాటి సూపర్ 6 ను సూపర్ సక్సస్ చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి, కష్టాలను ఎదురీది అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంటే, వైసీపీ నేతల్లో నేడు గుబులు మొదలయ్యిందన్నారు.
Minister BC Janardhan Reddy Key Comments
దీంతో రాష్ట్రంలో ఏదో జరగకూడనిది జరిగి పోతుందని, పదేపదే తన సొంత మీడియా, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అభివృద్ధి నిరోధకారిగా మారి వైసీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే పనిలో నిమగ్నమై ఉందన్నారు జనార్దన్ రెడ్డి. . కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు మాత్రం వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేరనే విషయం ఇప్పటికైనా గుర్తించాలన్నారు.. రాష్ట్రంలో వైసీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాభివృద్ధి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం తన ఉనికి కాపాడు కోవడం, స్వార్థ రాజకీయాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను సైతం వైసీపీ మార్కు బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : Kasturi Tella Interesting Comments : రాష్ట్ర ప్రగతికి కలిసి పని చేద్దాం : కస్తూరి తెల్లా

















