Minister Atchannaidu : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన టమాటాకు మద్దతు ధర లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీంతో పరిస్థితిని గమనించింది సర్కార్. ఈ మేరకు టమోటా రైతుల దయనీయ స్థితిని తాము అర్థం చేసుకున్నామని, ఆరు నూరైనా సరే రైతన్నలను ఆదుకుంటామని ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). టమోటా రైతులు నష్టపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు టమోటా సరఫరా చేసేందుకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. సోమవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
Minister Atchannaidu Comments
రాప్తాడు మార్కెట్లో టమోటా ధరలు ప్రస్తుతం కిలోకు రూ.9 నుండి రూ.18 వరకు ఉన్నాయన్నారు. అయితే పత్తికొండ మార్కెట్‌కు 40 టన్నుల కంటే ఎక్కువ టమోటాలు రావడం లేదన్నారు. వివిధ రైతు బజార్లకు 10 టన్నుల టమోటాలు సరఫరా చేయబడ్డాయని, సోమవారం పత్తికొండ మార్కెట్‌లో సేకరణ జరుగుతుందని, చిత్తూరులోని ప్రాసెసింగ్ యూనిట్‌కు 10 టన్నులు , రైతు బజార్లకు 15 టన్నులు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించే రైతు బజార్లకు వీటిని తరలిస్తున్నామని చెప్పారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
Also Read : CJI Strong Response : షూ విసరడం పట్ల స్పందించిన సీజేఐ
