Minister Atchannaidu Warning : వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి అంత సీన్ లేదు : అచ్చెన్నాయుడు

అన్న‌దాత‌ల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేదు

Hello Telugu - Minister Atchannaidu Warning

Hello Telugu - Minister Atchannaidu Warning

Minister Atchannaidu : అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య ఐదేళ్ల పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, ఈ దుస్థితిని ప్రజలు అనుభవించారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నారని, కానీ ఆ హోదా తాము ఇచ్చేది కాదని, అది ప్రజలు ఇచ్చేదని స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్ పిచ్చి మరింత ముదిరిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. వారంలో ఒకరోజు వచ్చి పూర్తిగా అబద్ధాలు చెప్పి, మళ్లీ బెంగళూరు వెళ్లి పోతున్నారని, 16 నెలలుగా ఇదే కొనసాగుతోందని అన్నారు. ఈ అబద్ధాలను నమ్మి ప్రజలు మళ్లీ మోస పోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తరపున వాస్తవాలను తెలియజేస్తున్నామని చెప్పారు.

Minister Atchannaidu Slams Ex CM YS Jagan

జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో వైద్య కళాశాలలు, రైతుల సమస్యలపై మాట్లాడారని అయితే ఈ రెండింటిపైనా ఆయనకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని, ఆయన పాలనలో ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. త‌మ‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క రైతు కూడా రోడ్ల మీదికి రాలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, ఇది విడ్డూరంగా ఉందని అన్నారు.

యూరియా సమస్యపై జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించిన తర్వాత రైతులు ఆందోళన చెందారని దీనికి తోడు కొన్ని ఫేక్ మీడియా ఛానెళ్లు, పత్రికలు యూరియా దొరకడం లేదని దుష్ప్రచారం చేశాయని అన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో అకాల వర్షాల వల్ల, మరికొన్ని జిల్లాల్లో ముందుగా వర్షాలు రావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని, దీనివల్లే ఒకటి రెండు వారాలు సమస్య ఏర్పడిందని వివరించారు. ఈ సమస్యను భూతద్దంలో చూపించి రైతులు అల్లాడి పోతున్నారని జగన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also Read : Kerala High Court Approved : గ్లోబ‌ల్ అయ్య‌ప్ప స‌ద‌స్సుకు హైకోర్టు అనుమ‌తి

Exit mobile version