Minister Atchannaidu : న్యూఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఈ సందర్బంగా కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ తో భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా మత్స్య రంగ అభివృద్ధికి మరింత తోడ్పాటు, ప్రోత్సాహం అందచేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్య కారుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు తీరంలో 194 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరాన్ని కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆక్వా హబ్ గా గుర్తింపు పొందిందని తెలిపారు.
Minister Atchannaidu Comments
ప్రధానంగా ఈ జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం, వ్యవస్థీకృత మత్స్యవృద్ధిని అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి తెలియజేశారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు సంప్రదాయ మత్స్యకారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 కృత్రిమ రీఫ్‌లను 194 కి.మీ తీరరేఖ వెంబడి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని 20 తీర గ్రామాలను CRCFV కింద ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం, మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మత్స్య నిల్వ సామర్థ్యాన్ని (stocking density) 1000 నుండి 2000 fingerlings/హెక్టార్‌కు పెంచడంతో పాటు, అన్ని గ్రామ పంచాయతీ ట్యాంకుల్లో నిల్వకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు.
విజయనగరం జిల్లా గరివిడిలో ఉన్న వెటర్నరీ సైన్స్ కాలేజీకి గుర్తింపు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.
Also Read : Gali Janardhan Reddy Alarming : హైకోర్టును ఆశ్రయించిన గాలి జనార్దన్ రెడ్డి
