Minister Atchannaidu Interesting Comments on CM : అరుదైన నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు

సీఎంగా 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గౌరవం

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments on CM

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments on CM

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అరుదైన నాయ‌కుడు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఆయ‌న స్పందించారు. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అన్నారు. ఆయన ఒక విజనరీ స్టేట్స్‌మన్, ఒక ప్రతిభావంతుడైన శిల్పి అని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ముందుగానే ఊహించి, ఆధునిక సాంకేతికతతో, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి విధానాలతో రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప నాయకుడు అని కితాబు ఇచ్చారు. ఐటి రంగం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన దార్శనికుడు అని అన్నారు.

Minister Atchannaidu Praises

అంతే కాదు రైతుల‌కు సాంకేతికతను చేరువ చేసిన సంస్కర్త అని ప్ర‌శంసించారు. యువతకు అవకాశాల ద్వారాలు తెరిచిన మార్గదర్శి చంద్రబాబు అని అన్నారు. ఏ రంగంలో చూసినా ఆయన దూరదృష్టి, కష్టపడే తీరు, పారదర్శక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ-గవర్నెన్స్, వాటర్ మేనేజ్‌మెంట్, ఫార్మ్ టు మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలను అమలుచేసి రాష్ట్రాన్ని ఆధునిక దిశగా నడిపించారని చెప్పారు. ఆయన కలల అమరావతి రాజధాని ఆలోచన, గ్రామ సచివాలయాల భావన, రైతుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలు, ప్రజా కేంద్రిత ఆలోచనలకు ప్రతీకలు అని మంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read : Jajula Srinivas Goud Fired on BC Reservation : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై స్టే ఇవ్వ‌డం అప్రజాస్వామికం

Exit mobile version