మిర్చి పంట‌లో తెగుళ్ల‌పై నివేదిక అందించాలి

ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించిన మంత్రి అచ్చెన్న‌

hellotelugu-MinisterAtchannaidu

అమార‌వ‌తి : మిర్చి పంటలో తెగుళ్లపై రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. మందుల పిచికారీపై శాస్త్రీయ సలహాలు రైతులకు అందించాలని పేర్కొన్నారు. .2021 నుంచి ఏపీలో వివిధ జిల్లాల్లో మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి జరుగుతోందని మంత్రికి వివరించిన వ్య‌వ‌సాయ శాఖ ఉన్న‌తాధికారులు.

రైతుల్లో అవగాహన పెంపున‌కు రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఉద్యాన శాఖ సిబ్బంది, వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్ర సందర్శనలు చేయాల‌ని పేర్కొన్నారు. రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అంద‌చేయాల‌ని సూచ‌చించారు. నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. నివార‌ణ చ‌ర్య‌లు, రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రికి వివ‌రించారు హ‌ర్టిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ డా.కే.శ్రీనివాసులు.

Exit mobile version