Minister Atchannaidu Fired on YS Jagan : రైతుల‌కు మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేద‌ని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఉల్లి, టమోటా రైతుల దీనస్థితి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. రైతుల కష్టాలు నిజంగా పట్టించుకునే హృదయం జగన్‌కి ఉంటే తన పాలనలోనే రైతులను దోపిడీకి గురి చేయడమేంటి అని ప్రశ్నించారు. రైతుల పట్ల కనీసం చిత్తశుద్ధి లేని త‌ను ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లి, టమోటా రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంద‌న్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు. కనీస మ‌ద్ద‌తు ధ‌ర గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు, క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపించడమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో రైతులు కన్నీరు మున్నీరయ్యారని, ఇప్పుడు ఆయన కార్చే కన్నీరు మొసలి కన్నీరు తప్ప మరేదీ కాదన్నారు.

Minister Atchannaidu Slams YS Jagan

ప్ర‌స్తుతం ఉల్లి రైతుల‌ను ఆదుకోవ‌డం లేద‌ని జ‌గ‌న్ అబ‌ద్ధపు ప్ర‌చారాలు చేస్తున్నాడ‌ని, మార్కెట్ లో ధ‌ర‌లు పెర‌గ‌డం, తగ్గ‌డం అనేది మార్కెట్ డైన‌మిక్స్ డిసైడ్ చేస్తాయ‌న్నారు. ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడు వ్య‌వ‌సాయ ఉత్పత్తుల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర‌ను అందించి రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని, ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు స‌బ్సీడి రూపంలో వినియోగ‌దారుల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌లో ఉత్ప‌త్తుల‌ను అంద‌చేస్తామ‌ని తెలిపారు అచ్చెన్నాయుడు. 2025 లో ఉల్లి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వుతున్నాయ‌ని ముంద‌స్తు అంచ‌నా వేసి క్వాలిటీతో సంబంధం లేకుండా 1200 మ‌ద్ధ‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. తొలుత‌ మార్క్ ఫెడ్ ద్వారా ప్ర‌భుత్వ‌మే ప్ర‌త్య‌క్షంగా రైతుల‌కు ఉల్లి క్వింటాకు 1200 చెల్లించి కొనుగోలు చేసి రైతుబ‌జార్ల ద్వారా అమ్మ‌కాలు చేయ‌డం జ‌రిగిందన్నారు.

Also Read : Apollo Tyres New Innovation : అపోలో టైర్స్ టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌

Exit mobile version