Minister Atchannaidu Effective Comments : ఫ‌సల్ బీమా యోజ‌న రైతుల‌కు ఆలంబ‌న

మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న

Hello Telugu - Minister Atchannaidu Effective Comments

Hello Telugu - Minister Atchannaidu Effective Comments

Minister Atchannaidu : అమ‌రావ‌తి – ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రైతులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు కోరారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప‌థ‌కానికి సంబంధించిన‌ గోడ పత్రికను శుక్రవారం మంత్రి అచ్చెన్న (Minister Atchannaidu) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తుంద‌ని, తుఫాను, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పంటల‌ బీమా పథకం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu Effective Comments

పంట‌లు పండించే క్ర‌మంలో రైతుల‌కు త‌లెత్తిన నష్టాన్ని అంచనా వేసి సాగు చేసిన రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసి పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా వరి.(ధాన్యం), మొక్క జొన్న (మక్కా), నువ్వులు, ప్ర‌త్తి పంట రైతుల‌కు లాభం చేకూరుతుంద‌న్నారు. ఈ పథకం కింద రైతులకు సహజ ఉత్పత్తుల నుండి రక్షణ కల్పించేందుకు రైతులకు ఆర్థిక భరోసా అందివ్వనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి అధిక భీమా రక్షణ పొందవచ్చునని సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించినా కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్లగాని, ప్రకృతి వైపరీత్యాల వల్లగాని పంటలు చేతికందని పరిస్థితి నెలకొంటోంద‌ని ఆవేద‌న చెందారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu).

ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే నష్ట‌పోయిన‌ మొత్తానికి బీమా సంస్థ నుంచి ఆర్ధిక సాయం అందుతుందన్నారు. దీని వ‌ల్ల పెట్టుబ‌డిలో కొంత మొత్త‌మైనా అందే ఛాన్స్ ఉంద‌న్నారు. ఇందులో భాగంగానే రైతులు నష్టపోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు మంత్రి. పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తార‌ని అన్నారు. వరద వంటి విపత్తులకు కూడా బీమా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు గోవిందరావు, జగన్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : MP Purandeswari-BJP Exclusive :బిజేపీ మ‌హిళా సార‌థి రేసులో పురంధేశ్వ‌రి..?

Exit mobile version