Minister Atchannaidu Important Update : రైతు ప్రయోజనాలే కూట‌మి ప్రభుత్వానికి ప్రాధాన్యం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డి

Hello Telugu - Minister Atchannaidu Important Update

Hello Telugu - Minister Atchannaidu Important Update

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) స్ప‌ష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.. రైతు అభ్యున్నతే త‌మ స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని చెప్పారు.

Minister Atchannaidu Interesting Update

శ‌నివారం కింజ‌రాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్ర‌బాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read : EC Shocking to TVK Party : టీవీకే విజ‌య్ పార్టీకి గుర్తింపు లేదు : ఈసీ

Exit mobile version