Minister Atchannaidu Alarming : గిరిజనులు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్యం

మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు కామెంట్

Hello Telugu - Minister Atchannaidu Alarming

Hello Telugu - Minister Atchannaidu Alarming

Minister Atchannaidu : అమ‌రావ‌తి – గిరిజ‌నులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నంలో నిర్వ‌హించిన ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నమాట్లాడుతూ దివంగ‌త సీఎం నంద‌మూరి తారక రామారావు 1982లో గిరిజ‌నుల అభ్యున్న‌తి కోసం ఐటీడీఏ వ్యవస్థను ఏర్పాటు చేశార‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి గిరిజ‌నులకు విద్య‌, వైద్య‌, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు అధిక ప్ర‌ధాన్య‌త ఇచ్చార‌ని అన్నారు. గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

Minister Atchannaidu Comments

ఏడాదిలో రాష్ట్రంలో గిరిజ‌న ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ. 1000 కోట్ల రూపాయాలు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే రూ. 230 కోట్ల రూపాయ‌లు తాగునీరు సౌక‌ర్యం కోసం నిధులు మంజూరు చేశామ‌ని అన్నారు. చిన్న త‌ర‌హ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తున్న‌టు తెలిపారు. వాటితో పాటు పరిసర ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). త‌ద్వారా యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. గిరిజ‌న యువ‌తకు స్థానికంగా ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు, ఉపాధి అవ‌కాశాలు పొందేందుకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, ప్ర‌త్యేకంగా నైపుణ్య శిక్ష‌ణ కేంద్ర ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని స‌మాంత‌రంగా తీసుకు వెలుతున్నామ‌ని అన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం హామీల‌న్ని అమ‌లు చేశామ‌ని, త‌ల్లికి వందనం, అన్న‌దాత సుఖీభ‌వ‌, మ‌హిళ‌ల‌కు గ్యాస్ సిలెండ‌ర్‌, పింఛ‌న్లు పెంపు అమ‌లు చేశామ‌ని చెప్పారు. ఈ నెల 15న మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పింఛ‌న్లుకు రూ.32 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అన్నారు. గిరిజన గ్రామాలకు ఇప్ప‌టికే 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఫోన్ సిగ్న‌ల్ వ్య‌వ‌స్ధ‌ను మెరుగు ప‌రిచేందుకు ఇప్ప‌టికే రూ.4 కోట్ల‌తో బీఎస్ఎన్ఎల్ ట‌వ‌ర్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు అచ్చెన్నాయుడు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న స‌భ్యులు బి.ర‌మ‌ణ‌మూర్తి, మామిడి గోవింద‌రావు, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ , ఆర్డీవో కృష్ణమూర్తి, ఆదివాసీ సంఘ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Also Read : NTPC Huge Investment : తెలంగాణలో 80 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్టీపీసీ

Exit mobile version