Minister Atchannaidu : విజయవాడ – ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు విశిష్ట సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో గవర్నర్ పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (APCOB) 62వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులకు, మహిళా సమాఖ్యలకు, యువతకు, సహకార సంఘాల సభ్యులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం సకాలంలో రుణాలు అందిస్తూ, వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భుజంగా ఆస్కాబ్ నిలుస్తోందని తెలిపారు. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి, ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Minister Atchannaidu Key Comments
ఈ బ్యాంకు వ్యవస్థ పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో ఉందని, సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను మరింత ప్రజలతో మమేకం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డిసీసీబి, పిఏసిఎస్, ఆప్కాబ్‌లు వంటి సంస్థలు కమర్షియల్ బ్యాంకులు రాని గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. గ్రామాల్లో పేదవారికి ఆర్ధిక తోడ్పాటు ఇవ్వడం, వారి అభివృద్ధికి ఆప్కాబ్ వ్యవస్థ ఎంతో దోహదం చేసిందన్నారు. ఈ విషయాన్ని మనందరం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో ఈ వ్యవస్థకి విడిగా మంత్రిత్వ శాఖ ఉండేది కాదని, 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ శాఖ విలువలను తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని చెప్పారు.
Also Read : Guvvala Balaraju Shocking BRS : ‘గులాబీ’కి గువ్వల గుడ్ బై
