Guvvala Balaraju : హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు భావోద్వేగంతో కూడిన లేఖను రాశారు. రెండు దశాబ్దాలకు పైగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు వాపోయారు. ఇది తనను మరింత బాధకు గురి చేసిందని, అయినా తప్పడం లేదన్నారు. ఆగస్టు 2 నుంచి పార్టీ నుండి వేరవుతున్నట్లు స్పష్టం చేశారు. తనను మన్నించాలని కోరారు. ఇన్నేళ్ల పాటు తనను ఆదరించి, అక్కున చేర్చుకుని, కీలకమైన పదవులను అప్పగించారని ఈ సందర్బంగా తాను కేసీఆర్ కు , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు రుణపడి ఉన్నానని పేర్కొన్నారు డాక్టర్ గువ్వల బాలరాజు.
Ex MLA Guvvala Balaraju Resigned from BRS Party
పార్టీకి సంబంధించి అన్ని పదవుల నుంచి తాను తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తనకు ఎవరి పట్ల ద్వేషం లేదన్నారు. తనకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఇదిలా ఉండగా గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. పలు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొంత వివాదాస్పదంగా వ్యవహరించారు. దీంతో తను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు. జిల్లా పరిషత్ సమావేశంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగడం అప్పట్లో కలకలం రేపింది. మొత్తంగా తను పార్టీని వీడడం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
డాక్టర్ గువ్వల బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం అర్థవంతంగా ఉంది, నాపై మీకున్న నమ్మకం వల్లనే అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Also Read : Minister Uttam Kumar Fired on KCR : నిపుణుల కమిటీ వద్దన్నా పట్టించుకోలేదు
