Minister Atchannaidu Interesting Comments : న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments

Minister Atchannaidu : విశాఖపట్నం : వ్యవసాయ రంగం బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖా మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) భాగస్వామ్య సదస్సులో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర GSDPలో 35 శాతం ప్రాథమిక రంగం నుంచే వస్తుంద‌న్నారు. దీని ద్వారా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్తితి నెల‌కొంద‌న్నారు అచ్చెన్నాయుడు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంద‌ని చెప్పారు ఫామ్ మెకనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం రైతుల ఖర్చులను భారీగా తగ్గించి, లాభదాయకతను పెంచుతోందని వివరించారు.

Minister Atchannaidu Key Comments

రసాయనాలు లేని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు గల డిమాండ్ పెరుగుతుండటంతో, సహజ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తొమ్మిదేళ్ల క్రితం ముందుచూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన న్యాచురల్ ఫార్మింగ్ నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుప రచడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Minister Savitha Important Update : టెక్స్ టైల్స్ రంగం లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

Exit mobile version