CII : అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం నగరం వేదికగా ఈనెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు సీఐఐ (CII) సమ్మిట్ 2025 నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు, పెట్టుబడిదారులు, సీఈఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు హాజరు కానున్నారు. వీరితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఇదిలా ఉండా పార్టనర్ షిప్ సమ్మిట్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ విపత్తుల నిర్వహణ, హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత. సమ్మిట్ కు ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు మంత్రి.
CII Summit Updates
ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు వంగలపూడి అనిత. విశాఖ నగరం మొత్తం డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం ఉండాలని, ఫైర్ సేఫ్టీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు వంగలపూడి అనిత. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ముందుగానే సమాచారం అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ వేదికగా ఏపీ కూటమి సర్కార్ ఏకంగా లక్షా 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీంతో ఈ సమ్మిట్ కు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : Nara Lokesh Clear Update : తెలుగుదేశంకు కార్యకర్తలే బలం
