Nara Lokesh : అమరావతి : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లదేనని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయo ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి, అర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు నెలాఖరులోగా అన్ని పార్టీ, నామినేటెడ్ పదవులూ భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇంఛార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో జోనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే ఇంకా బలంగా పనిచేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
Minister Nara Lokesh Key Comments
దేశంలో ఎక్కడా ఏ పార్టీకి లేని విధంగా అత్యంత క్రమశిక్షణ, నిబద్దత కలిగిన కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారని చెప్పారు నారా లోకేష్. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో, సమర్థవంతమైన నాయకుడైన సీఎం నారా చంద్రబాబు నాయుడి పాలనలో అనేక రకాలుగా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను తీసుకు వచ్చారని అన్నారు. వీటిని కిందిస్థాయి ప్రజల వద్దకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన కార్యకర్తలపై ఉందన్నారు నారా లోకేష్. వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాము అండగా ఉంటామని నొక్కి చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తకు బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు మంత్రి.
Also Read : K Kavitha Strong Demand : సర్కార్ నిర్వాకం నిర్వాసితులకు శాపం
