Minister Anam : విజయనగరం జిల్లా : శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం అంగరంగ వైభవోపేతంగా మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా తరలి వచ్చారు భక్తులు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు తో కలిసి పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఆనంతో (Minister Anam) పాటు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతి రాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Minister Anam Ramanarayana Reddy Comments
సిరులిచ్చే కల్పవల్లి భక్తులకు అనుగ్రహాలతో అలరించే శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల నిండి పోయాయి. అంతకు ముందు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, వేద పండితులు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు చేత వేదాశీర్వచనం అందుకున్నారు మంత్రులు, గవర్నర్.పైడితల్లి అమ్మవారి రథయాత్రను చూసేందుకు నలుమూలల నుంచి విజయనగరం చేరుకున్నారు.
Also Read : Hydraa Commission Warning : ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం : హైడ్రా
