Popular Festival Dussehra-Minister Anam : ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు భారీగా ఏర్పాట్లు

ప్ర‌క‌టించిన మంత్రి ఆనం రామనారాయ‌ణ రెడ్డి

Hello Telugu - Popular Festival Dussehra-Minister Anam

Hello Telugu - Popular Festival Dussehra-Minister Anam

Minister Anam : విజ‌య‌వాడ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (Minister Anam). ఈ సంద‌ర్బంగా స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క‌ సమావేశం లో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, దేవస్థానం ఈవో శీనా నాయక్ పాల్గొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, దసరా ఉత్సవాల్లో రద్దీ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణలో సాంకేతికత వినియోగంపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. స‌మీక్ష అనంత‌రం ఆనం రామ నారాయ‌ణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబ‌ర్ 22 నుండి ఇంద్ర‌కీలాద్రి ఆల‌యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇస్తార‌ని చెప్పారు.

Minister Anam Ramanarayana Reddy Key Comments on Dussehra Arrangements

ఈ దసరా లో కమాండ్ కంట్రోల్ రూమ్ కీలకం కావాలని, తిరుమల లో భక్తుల రద్దీ నియంత్రణ లో ఏ విధానం ఉందో అదే తరహా లో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలని ఆదేశించారు. భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని అందిన సమాచారం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళల సౌలభ్యం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పధకం వలన మహిళా భక్తుల సంఖ్య పెరిగే సంఖ్య ఉందన్నారు.

దసరా ఉత్సవాల్లో అన్ని శాఖల సమన్వయం అవసరమని, అధికారులు, సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ కీలకమని దేవదాయ శాఖ కమిషనర్ కె. రామ చంద్ర మోహన్ అన్నారు. దేవస్థానం సిబ్బందికి అన్ని పనులపై అవగాహన ఉండాలని, 15 తేదీ లోపు అన్ని పనులు పూర్తి కావాలని, దేవదాయ శాఖ నుండి కావలసిన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో స్వచ్చంద సేవకుల పాత్ర కీలకం మని, వారికి శిక్షణ ఇచ్చి సేవల్లో వినియోగించు కోవాలని ఆదేశించారు.

Also Read : CSK Strong Focus – Sanju Samson : సంజూ శాంస‌న్ పై క‌న్నేసిన సీఎస్కే

Exit mobile version