Minister Anam Controversial Comments : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద కామెంట్స్

వీఆర్ హైస్కూల్ పేరు మార్చ‌డంపై తీవ్ర అభ్యంత‌రం

Hello Telugu - Minister Anam Controversial Comments

Hello Telugu - Minister Anam Controversial Comments

Minister Anam : నెల్లూరు జిల్లా – నెల్లూరు జిల్లాలో సోమ‌వారం మంత్రి నారా లోకేష్ సమ‌క్షంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (Minister Anam) షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్క‌డున్న వారంతా తీవ్ర దిగ్భాంత్రికి లోన‌య్యారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వీఆర్ స్కూల్ అభివృద్దికి మున్సిల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌హ‌క‌రిస్తే అది మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్కూల్ ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌పై నారా లోకేష్ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా వినిపించు కోలేదు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

Minister Anam Comments

నెల్లూరు లోని వీఆర్ విద్యా సంస్థ‌లు త‌మ కుటుంబం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాయ‌ని చెప్పారు. గ‌తంలో పాలించిన వైఎస్సార్సీపీ జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలోని ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష క‌ట్టింద‌న్నారు. స్కూల్ యాజమాన్య క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి అకార‌ణంగా, అన్యాయంగా తొల‌గించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ప‌వ‌ర్ లో లేక పోవ‌డం వ‌ల్ల ఇది చోటు చేసుకుంద‌న్నారు. కానీ ఇవాళ అనుకోకుండా పొంగూరు నారాయ‌ణ రావ‌డం, దీనిని అభివృద్ది చేశాన‌ని చెప్పుకోవ‌డం ప‌ట్ల తను ఒప్పుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. VR హైస్కూల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని డిమాండ్ చేశారు.

అంత వ‌ర‌కు తాను ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌న్నారు. ప్రభుత్వ స్కూళ్లను మంత్రి నారాయణ దత్తత తీసుకోవాలని కోరారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల ద్వారా ఎదిగిన తర్వాతే మంత్రి నారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. కానీ తాము మొద‌టి నుంచీ పాలిటిక్స్ ఫ్యామిలీలో ఉన్నామ‌ని తెలిపారు.

Also Read : Minister Narayana Interesting : పి4 ద్వారా పేద కుటుంబాల దత్తత

Exit mobile version