Minister Narayana : నెల్లూరు – సంక్షేమంతో పాటు సమాజంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి4 విధానాన్ని తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లాలోని విఆర్ స్కూల్‌లోని అనేక మంది పేద విద్యార్థుల కుటుంబాలను దాతలు దత్తత తీసుకున్నారు. నారాయణ (Minister Narayana) కుమార్తె శరణి స్వయంగా 20 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇక్కడి విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల ద్వారా 4 సెట్ల యూనిఫాంలు, సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అడ్మిషన్లు ప్రారంభించిన మొదటి రోజే వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. అధిక డిమాండ్ కారణంగా అడ్మిషన్లు లేవనే బోర్డును పాఠశాల ఏర్పాటు చేసింది. ఇది సానుకూల మార్పుకు స్పష్టమైన సంకేతం. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉచిత విద్యను విస్తరిస్తారు.
Minister Narayana Comments
మంత్రి నారాయణ విద్యార్థులకు ఉచిత రవాణా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. పేద చిన్నారులు పెంచలయ్య, వెంకటేశ్వర్లు ఇక్కడ అడ్మిషన్ పొందినందుకు తాను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. వారి ఉన్నత విద్యకు తాను పూర్తి బాధ్యత వహించి, అన్నివిధాలా అండగా నిలుస్తానని ప్రకటించారు. ఎన్నికల సమయంలో విఆర్ హైస్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తానని, స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
ప్రజల ఆశీస్సులతో ఆయన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాఠశాలను తిరిగి తెరిపించి, ఆధునీకరించడం ద్వారా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి వెంటపడి ఈ స్కూలు అనుమతులు సాధించుకున్నారు. నెల్లూరు విఆర్ స్కూలులో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ సిఎస్ ఆర్ నిధులతో రూ. 15 కోట్ల విలువైన పనులను చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఈ పనులను మంత్రి నారాయణ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ… వేగంగా పూర్తయ్యేలా చూసుకున్నారు.
Also Read : Minister Nara Lokesh Challenge : ఏపీ విద్యా వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతా
