Minister Anam Interesting Updates : యువ‌త ఉపాధి కోసం మెగా జాబ్ మేళాలు

స్ప‌ష్టం చేసిన ఆనం రామ నారాయ‌ణ రెడ్డి

Hello Telugu - Minister Anam Interesting Updates

Hello Telugu - Minister Anam Interesting Updates

Minister Anam : నెల్లూరు జిల్లా – మెట్టప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే మెగా జాబ్‌మేళాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి (Minister Anam). ఎన్డీఎ కూటమి నాయకులంతా సమష్టిగా జాబ్ మేళా విజయవంతం కోసం పని చేస్తున్నామ‌న్నారు. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌ సహకారంతో ఆత్మకూరులో మెగా జాబ్‌మేళాకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

Minister Anam Ramanarayana Reddy Conducts Mega Job Mela

గతంలో ఎన్నడూ కూడా ఆత్మకూరులో ఇంత పెద్ద ఎత్తున జాబ్‌మేళా జరగ లేద‌న్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సతీష్‌రెడ్డి, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జాబ్‌మేళాకు హాజరకానున్నారని అన్నారు. ఆత్మకూరులో ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్‌, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సాంకేతిక విద్య నభ్యసించి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ధ్యేయం అని చెప్పారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయని, సుమారు 300కి పైగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కూడా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల‌డించారు. కళాశాలల వారీగా పాసై ఖాళీగా ఉన్న డేటాను సేకరిస్తున్నారని అన్నారు. ఆత్మకూరులోని సాంకేతిక విద్య పాసై ఖాళీగా ఉన్న యువకులు, ప్రస్తుతం ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులందరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .

Also Read : BCCI Profit : బీసీసీఐకి రూ. 9742 కోట్ల ఆదాయం

Exit mobile version