BCCI : భారత దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా ఆర్గనైజేషన్ గా బీసీసీఐ మరోసారి రికార్డ్ నమోదు చేసింది. ఏకంగా బీసీసీఐ రూ . 9742 కోట్లు ఆదాయం గడించింది. ఇందులో అత్యధికంగా వాటాను ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కలిగి ఉంది. ఏకంగా 59 శాతం నమోదు చేసింది. ఇతర క్రీడా ఆర్గనైజేషన్స్ ను విస్మయానికి గురి చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 లీగ్‌లో 10 జట్లతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొంటారు. ఏ టోర్నీకి రానంత ప్రచారం , ఆదరణ ఈ ఒక్క ఐపీఎల్ కు లభిస్తోంది.
BCCI Profit
తాజాగా అందిన నివేదిక ప్రకారం బీసీసీఐకి (BCCI) 2023-24 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఆదాయం సమకూరింది. ఐపీఎల్ అనేది వార్షిక ఫ్రాంచైజీ ఆధారిత లీగ్. 2007లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ కంటిన్యూగా కొనసాగుతూ వస్తోంది. ఇక మొత్తంగా బీసీసీఐ రూ. 9741.7 కోట్లు సంపాదించగా ఇందులో ఐపీఎల్ పరంగా రూ. 5,761 కోట్లు ఆదాయంగా సమకూరింది. ఇది అందరినీ , ప్రత్యేకించి క్రీడా వర్గాలను విస్మయానికి గురి చేసింది.
రోజు రోజుకు మీడియా హక్కులకు డిమాండ్ ఉంటోంది. అందుకే బీసీసీఐకి కాసుల పంట పండుతోంది.
ఐపీఎల్ మరింత పెరిగే కొద్దీ గణనీయంగా ఆదాయం గడిస్తూ రావడం పక్కా అని బీసీసీఐకి చెందిన ఒకరు పేర్కొన్నారు. ఇక ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కులతో సహా ఐపీఎల్ యేతర మీడియా హక్కులను అమ్మడం ద్వారా దాదాపు రూ. 361 కోట్లు సంపాదించింది బీసీసీఐ.
Also Read : Yarlagadda Lakshmi Prasad Interesting Meet : గవర్నర్ తో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ భేటీ
