హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్ చేశారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ ప్రాంతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఆస్తులు, వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణ కావాలని, కానీ ఇక్కడే సంపాదించుకుంటూ ఆంధ్రా పాట పాడితే ఎలా అని ప్రశ్నించారు. తను ఆరాధించే కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ది మార్చేలా చూడాలని అన్నారు. పవన్ కళ్యాణ్ నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ ఇలాగే విర్రవీగితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. తాము తల్చుకుంటే ఏ ఒక్కరు ఇక్కడ ఉండరని అన్నారు. ఆంధ్రాపై అంత ప్రేమ ఉన్నోడివి అయితే ఇక్కడ ఎందుకు ఆస్తులు కొనుగోలు చేశావో చెప్పాలన్నారు. అన్నీ అమ్మేసుకుని కోనసీమకు వెళ్లి పోవాలని హితవు పలికారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ . పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు అంజన్న స్వామి కనువిప్పు కలగ జేయాలని దర్శనం చేసుకొని కోరుకున్నానంటూ చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.

















