Milk Price Drop : జీఎస్టీ రిఫార్మ్స్ తో తగ్గనున్న పాల ధరలు

దీంతో అమూల్, మదర్ డెయిరీ వంటి ప్రధాన కంపెనీల పాల ధరల్లో తగ్గింపు వచ్చే అవకాశం ఉంది...

Hello Telugu - Milk Price Drop

Hello Telugu - Milk Price Drop

Milk : కేంద్ర ప్రభుత్వం పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అల్ట్రా హై టెంపరేచర్ (UHT) పాలను (Milk) పన్ను నుంచి పూర్తిగా మినహాయించారు. దీంతో అమూల్, మదర్ డెయిరీ వంటి ప్రధాన కంపెనీల పాల ధరల్లో తగ్గింపు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ కంపెనీల పాలపై (Milk) 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొత్త నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుండగా, ధరలు లీటరుకు రూ.2 నుండి రూ.4 వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని అంచనా.

Milk – అమూల్ పాల ధరల్లో మార్పులు

మదర్ డెయిరీ పాల ధరల్లో మార్పులు

మదర్ డెయిరీ స్పందన

జీఎస్టీ కోతలపై మదర్ డెయిరీ అధికారికంగా స్పందించింది. “వినియోగదారులకు లాభం చేకూరేలా ధరల్లో మార్పులు చేస్తాం” అని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బాండ్లిష్ తెలిపారు. పనీర్, చీజ్, నెయ్యి, వెన్న, పాల ఆధారిత పానీయాలు, ఐస్ క్రీమ్ వంటి ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు మార్కెట్‌కు పెద్ద ఊతమని ఆయన అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో మదర్ డెయిరీ టర్నోవర్ రూ.17,500 కోట్లు కాగా, ఈ నిర్ణయం భవిష్యత్తులో పాల ఉత్పత్తుల డిమాండ్‌ను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : Stock Market Growth : నేడు లాభాల్లో నడిచిన సూచీలు

Exit mobile version