Microsoft New Innovation : భాగ్యనగరంలో వారి సేవలను భారీగా విస్తరించనున్న ‘మైక్రోసాఫ్ట్’

ఇది హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్లో ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఒకటిగా రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Hello Telugu - Microsoft New Innovation

Hello Telugu - Microsoft New Innovation

Microsoft : అమెరికా టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ నగరంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందుకోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్‌ సెంటారస్‌ భవనంలో 2.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్లో ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఒకటిగా రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Microsoft New Innovation in Hyderabad

ప్రాప్‌స్టాక్‌ సమాచారం ప్రకారం, వర్క్‌స్పేస్‌ నిర్వాహక సంస్థ టేబుల్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ నుంచి ఫీనిక్స్‌ సెంటారస్‌లోని మూడో, నాలుగో అంతస్తులను మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఇండియా ఐదేళ్ల కాలానికి లీజు చేసుకుంది. ఈ ఒప్పందం జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. చదరపు అడుగుకు రూ.67 చొప్పున మైక్రోసాఫ్ట్‌ నెలకు రూ.1.77 కోట్ల అద్దె చెల్లించనుంది. నిర్వహణ వ్యయాలు, ఇతర చార్జీలతో కలిపి మొత్తం రూ.5.4 కోట్లు నెలసరి భారం కింద వస్తుందని సమాచారం. ఏటా అద్దె 4.8% పెరుగనుంది. అదనంగా సంస్థ రూ.42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రస్థానం

మైక్రోసాఫ్ట్‌ 1998లో భారత్‌లో తొలి ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న అతిపెద్ద పరిశోధన కేంద్రం ఇదే. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌ ప్రస్తుతం ఇంజినీరింగ్‌, కృత్రిమ మేధ (AI), క్లౌడ్‌ టెక్నాలజీలపై దృష్టి సారిస్తోంది. ఫీనిక్స్‌ సెంటారస్‌లోని ఈ కొత్త కార్యాలయం కొత్త ఆర్‌అండ్‌డీ బృందాలు, సాంకేతిక విభాగాలకు కేంద్రంగా నిలవనుంది. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణె, నోయిడాల్లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ ఆకర్షణ

ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో ఒక కోటి చదరపు అడుగులకుపైగా ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు కుదిరాయి. అందులో టెక్నాలజీ సంస్థలే ప్రధాన వాటాను దక్కించుకున్నాయి. అంతర్జాతీయ టెక్నాలజీ, ఆర్థిక సేవల కంపెనీల కేంద్రాలతో పాటు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు (GCCs) హైదరాబాద్‌ ఒక కీలక హబ్‌గా అవతరించింది.

Also Read : GST Important Update : ఆ వస్తువులపై భారీగా జీఎస్టీ తగ్గించిన మోడీ సర్కార్

Exit mobile version