మెస్సీ కార్య‌క్ర‌మం సాల్ట్ లేక్ స్టేడియంలో గంద‌ర‌గోళం

విచార‌ణ‌కు ఆదేశించిన ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ

hellotelugu-ChaosKolkatta

కోల్ క‌తా : భార‌త దేశంలో ప్ర‌ముఖ ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. త‌న మెస్సీ గోట్ టూర్ లో భాగంగా హైద‌రాబాద్ , కోల్ క‌తా, ఢిల్లీ, ముంబైల‌లో ప్ర‌ముఖుల‌ను క‌లుస్తారు. శ‌నివారం హైద‌రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన త‌ర్వాత త‌ను నేరుగా కోల్ క‌తాకు వెళ్లాల్సి ఉంది. అక్క‌డ జ‌రిగే ఈవెంట్ లో పాల్గొంటాడు. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్. త‌న‌తో పాటు త‌న కుమారుడిని కూడా తీసుకు వెళ్లాడు. ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది మెస్సీ టూర్ సంద‌ర్బంగా కోల్‌కతాలోని వివేకానంద యుబా భారతి క్రిరంగన్ లో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ తన ‘గోట్ ఇండియా టూర్ 2025’ కార్యక్రమం జ‌ర‌గ‌నుంది.

టిక్కెట్ల కోసం భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని స్పష్టంగా చూడక పోవడంతో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం చెలరేగింది. వేలాది మంది అభిమానులు నిరసన వ్య‌క్తం చేశారు, పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వ‌చ్చింది. దీంతో రెచ్చి పోయిన వారంతా కుర్చీల‌ను విసిరేశారు ఖాకీల‌పై. ఈ ఘ‌ట‌న‌పై సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సీరియ‌స్ అయ్యారు. విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2011 తర్వాత వేదికపై తొలిసారిగా మెస్సీ కనిపించడంతో పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు అర్జెంటీనా సహచరుడు రోడ్రిగో డి పాల్‌తో కలిసి, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మెస్సీ స్టేడియంకు చేరుకున్నారు. రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version