MEIL Shocking Tamilnadu : 250 మెగావాట్ల ప్లాంట్ ఎంఈఐఎల్ స్వాధీనం

త‌మిళ‌నాడు ఇంధన రంగంలో కొత్త మైలురాయి

Hello Telugu - MEIL Shocking Tamilnadu

Hello Telugu - MEIL Shocking Tamilnadu

MEIL : హైద‌రాబాద్ : తమిళనాడులో నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (MEIL) కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సంస్థ నుంచి వంద శాతం వాటాను కొనుగోలు చేసినట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఎంఈ ఐ ఎల్ అనుబంధ సంస్థ ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడులోని నేవేలిలో ఉన్న టి ఏ క్యూ ఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్‌సి నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీన ప్రక్రియ ఎంఈఎల్ గ్రూప్ వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం , నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్‌ఫ్రా డెవలపర్‌గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

MEIL Shocking Tamilnadu

టి ఏ క్యూ ఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొల్పింది. ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని ఎం ఈ ఐ ఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

Also Read : DY CM Pawan Kalyan Clear Update : రైతుల‌ను ఆదుకుంటాం ప‌రిహారం చెల్లిస్తాం

Exit mobile version