DY CM Pawan Kalyan Clear Update : రైతుల‌ను ఆదుకుంటాం ప‌రిహారం చెల్లిస్తాం

యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Update

Hello Telugu - DY CM Pawan Kalyan Clear Update

Pawan Kalyan : అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్ట పోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan). రాష్ట్ర వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46వేల హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్ట పోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. పంట‌లు దెబ్బ‌తిన్న రైతుల‌తో మాట్లాడారు. వారికి ధైర్యం క‌ల్పించారు. ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం అని చెప్పారు. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించామ‌ని తెలిపారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు.

DY CM Pawan Kalyan Comments

వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేయ‌డం జ‌రిగింద‌న్నారు డిప్యూటీ సీఎం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నా దృష్టికి వచ్చింద‌న్నారు. వారిని ఆదుకొనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌• అంటు వ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ ను తుపాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామ‌న్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రహదారులు తుపాను దాటికి దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించార‌ని తెలిపారు.

Also Read : CM Chandrababu Important Update : న‌ష్ట పోయిన ప్ర‌తి రైతును ఆదుకుంటాం

Exit mobile version