Megha Sudhakar Reddy : హైదరాబాద్ : పోలీసుల సేవలు నిరుపమానమని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) డైరెక్టర్ పీ సుధారెడ్డి (Megha Sudhakar Reddy) అన్నారు. రేయనకా పగలనకా ప్రజల భద్రతకు పోలీసులు చేస్తున్న కృషి వెల కట్టలేనిదని అన్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద భద్రతా విధులు నిర్వర్తించే తెలంగాణ స్పెషల్ పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన భవన నిర్మాణాన్ని ఎం ఈ ఐ ఎల్ సొంత ఖర్చులతో చేపట్టింది. అమెరికన్ కాన్సులేట్ ఎదురుగా కేటాయించిన స్థలంలో ఈ భవన నిర్మాణానికి ఎం ఈ ఐ ఎల్ డైరెక్టర్ పీ .సుధారెడ్డి శంఖుస్థాపన చేశారు. 50 మంది భద్రతా సిబ్బంది వినియోగించుకునేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్దతిలో త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పోలీస్ సిబ్బందికి ఎం ఈ ఐ ఎల్ అందించనుంది.
Megha Sudhakar Reddy Provides Accomidation for American Security
ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో బెటాలియన్స్ అదనపు డి జీ పీ సంజయ్ కుమార్ జైన్ , మాదాపూర్ డీసీపీ రితిరాజ్ , కొండాపూర్ బెటాలియన్ కమాండెంట్ ఎం రామకృష్ణ , అసిస్టెంట్ కమాండెంట్‌లు ఎం.పార్ధసారధి రెడ్డి, ఎస్.రాంబాబు, అమెరికన్ కాన్సులేట్ భద్రతా అధికారులు వెంకట్, సతీష్, రవిచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధా రెడ్డి మొక్కను నాటారు. సుధా రెడ్డి మాట్లాడుతూ తానూ ప్రపంచమంతా పర్యటిస్తుంటానని, అయితే ఇక్కడ ఉన్నంత భద్రత అక్కడ కనిపించదన్నారు. తన స్నేహితులు పలువురు వారి కుటుంబ సభ్యులతో కలిసి లేదా ఒంటరిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు చాలా భద్రంగా ఉన్నట్లుగా భావిస్తారన్నారు. ఇదంతా పోలీస్ ల వల్లే సాధ్యం అవుతుందన్నారు. ప్రజల రక్షణ కోసం కష్టించే పోలీసుల శ్రమ, సేవకు తగిన గుర్తింపు లభించటం లేదని అన్నారు.
Also Read : Delhi Capitals Strong Focus on Samson : సంజూ శాంసన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఫోకస్
