మెగాస్టార్ బాబీ మూవీ త్వ‌ర‌లోనే స్టార్ట్

ఏప్రిల్ 20 త‌ర్వాత సెట్స్ పైకి రానుంది

hellotellugu-ChiranjeeviBobby

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు మెగాస్టార్ చిరంజీవి. త‌ను వ‌య‌సు పెరిగినా ఇంకా కుర్ర‌కారుతో పోటీ ప‌డుతున్నారు. త‌న కూతురు వ‌య‌సు క‌లిగిన హీరోయిన్లు సైతం ఆశ్చ‌ర్య పోయేలా స్టెప్పులు వేస్తున్నారు. విస్తు పోయేలా చేస్తున్నారు. రోజు రోజుకు మ‌రింత నాజుకుగా త‌యార‌వుతూ స‌ర్ ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ఆయ‌న ఫుల్ సంతోషంగా ఉన్నారు. దీనికి కార‌ణంగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వహించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారూ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇది అతి పెద్ద క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ప‌క్క‌న పెడితే తాజాగా త‌న‌కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది.

చిరంజీవితో ద‌ర్శ‌కుడు బాబీ సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని టాక్. చిరంజీవి విష‌యానికి వ‌స్తే త‌న కెరీర్ లో ఈ కొత్త మూవీ 158వ‌ది. కాగా ఏదైనా ఒక శుభ ముహూర్తాన ఈ సినిమా ప్రారంభోత్సవం (ముహూర్తం) జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో తలెత్తిన సమస్యలను పరిష్కరించు కోవడానికి ఆ నిర్మాతలకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ సినిమా ప్రారంభాన్ని కొద్దిగా వాయిదా వేశారు. కొత్త ప్రాజెక్టుతో ముందుకు వెళ్ళే ముందు, ప్రస్తుత సమస్యను పూర్తిగా పరిష్కరించు కోవాలని చిరంజీవి ఆ చిత్ర బృందానికి సూచించినట్లు తెలుస్తోంది.

Exit mobile version