Harish Rao Interesting Comments : వైద్య వృత్తి అత్యంత గొప్ప‌ది : హ‌రీశ్ రావు

హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 2025 కార్య‌క్ర‌మం

Hello Telugu - Harish Rao Interesting Comments

Hello Telugu - Harish Rao Interesting Comments

Harish Rao : హైద‌రాబాద్ : స‌మాజంలో అత్యంత గొప్ప వృత్తి కేవ‌లం వైద్యమేన‌ని, ఆ త‌ర్వాత ఉపాధ్య‌య వృత్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 2025 కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. హైబిజ్ టీవీ ప్రతి సంవత్సరం ఉత్తమ డాక్టర్లకు అవార్డులు ఇచ్చే మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని అన్నారు. ఎవరైనా జీవితంలో కోరుకునేది అప్రీసియేషన్ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. సమాజం ఎప్పుడైతే గుర్తిస్తుందో మరింత బాధ్యతగా, మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కరోనా తర్వాత డాక్టర్ల గొప్పతనాన్ని సమాజం మరోసారి గుర్తించిందన్నారు. డాక్టర్లు అంటే సమాజంలో సహజంగానే చాలా గౌరవం ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఎవరికీ దొరకని గౌరవం డాక్టర్లకు మాత్రమే దొరుకుతుందన్నారు.

Harish Rao Key Comments

ఎక్క‌డికి వెళ్లినా వైద్యో నారాయణ హరి అంటారని, అమ్మ జన్మనిస్తే కొన్ని సందర్భాల్లో డాక్టర్లు పునర్జన్మని ఇస్తారని ప్ర‌శంస‌లు కురిపించారు హ‌రీశ్ రావు. తాను హెల్త్ మినిస్టర్‌గా పని చేశానని. రాజకీయ నాయకుడిగా డాక్టర్లకు ఉండే ఇబ్బందులను అర్థం చేసుకుంటాన‌ని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చదవడం చాలా కష్టం. దాని తర్వాత పీజీ చేయాలి. దానితో స్పెషలైజేషన్ చేయాలి. ఎంతో కష్టపడితే కానీ గుర్తింపు రాదని అన్నారు. పండుగలు ఉండవు. సెలవులు ఉండవు. కుటుంబంతో సమయం ఉండదు. మీ టైం మీ చేతిలో ఉండదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హ‌రీశ్ రావు. ఎంత సోషల్ రెస్పెక్ట్ ఉందో అంత డిఫికల్టీ కూడా ఉంటుందన్నారు. హైదరాబాద్ ఈరోజు మెడికల్ హబ్‌గా మారిందన్నారు. ఇక్క‌డి హాస్పిటల్లోని పేషెంట్లలో 50% మంది దేశ విదేశాల నుండి వస్తున్నారని చెప్పారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత కేసీఆర్ దేన‌ని అన్నారు.

Also Read : Hydraa Huge Property Save : రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Exit mobile version