Manickam Tagore : ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ఎన్నికల కమిషన్ గురించి చర్చించడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రశ్నించింది. పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ, ఎన్నికల కమిషన్‌ను పార్లమెంటరీ పరిశీలన చేయాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ నొక్కి చెప్పింది. గతంలో ఈసీఐ ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల్లో ధన బలం వినియోగంపై చర్చ జరిగినప్పుడు అనేక సంఘటనలను పార్టీ నాయకుడు మాణికం ఠాగూర్ (Manickam Tagore) ఉదహరించారు.
Manickam Tagore Slams Modi
ఈ సందర్బంగా ఆదివారం మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి నేటి దాకా జరిగిన ఎన్నికల నిర్వహణపై పూర్తిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రెండు సభలలో ఎన్నికల కమిషన్ పనితీరుపై చర్చకు అనుమతించినందున, పార్లమెంటులో చర్చకు ఎందుకు సిద్దం కావడం లేదంటూ సీరియస్ గా ప్రశ్నించారు మాణికం ఠాగూర్. దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ఇది 143 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం. పార్లమెంటులో ఎన్నికల సంఘం పనితీరుపై చర్చకు అనుమతించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
ఇది కొత్త విషయం కాదని, పార్లమెంటు దశాబ్దాలుగా ఎన్నికల సంఘం ప్రవర్తనపై, ఎన్నికల సంస్కరణలను డజన్ల కొద్దీ సార్లు చర్చించడం జరిగిందన్నారు. 1957లో, ల 1970, 1981, 1986, 1991, 2015లో ఎన్నికల సంస్కరణలపై విస్తృతంగా చర్చించామన్నారు మాణికం ఠాగూర్.
Also Read : Telangana Govt Strong Focus : పర్యాటక రంగంపై తెలంగాణ ఫోకస్
