Telangana Govt Strong Focus : ప‌ర్యాట‌క రంగంపై తెలంగాణ ఫోక‌స్

కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాలి

Hello Telugu - Telangana Govt Strong Focus

Hello Telugu - Telangana Govt Strong Focus

Telangana Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగ వాటాను 10 శాతం పెంచడం ముఖ్య లక్ష్యాలుగా ప్రకటించింది. వీటి ద్వారా తెలంగాణను (Telangana Govt) దేశంలోనే అత్యధిక దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు వచ్చే టాప్-5 రాష్ట్రాల జాబితాలోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Govt Strong Focus

ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి, వారసత్వ ప్రదేశాలు , సాంస్కృతిక కేంద్రాల ప్రచారం, హాస్పిటాలిటీ సేవల మెరుగుదల, అలాగే తెలంగాణ పర్యాటక ప్రాధాన్యతను హైలైట్ చేసే గ్లోబల్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌లపై దృష్టి పెట్టనుంది. ఆధ్యాత్మిక, వారసత్వం, సాంస్కృతిక, సాహసం, వైద్యం, వెల్ నెస్ , పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, సురక్షితమైన పర్యాటకంపై ప్రాధాన్యత ఇవ్వాల‌ని అనుకుంటోంది.

అంతే కాకుండా గోదావరి, కృష్ణ నదులపై నది ఆధారిత పర్యాటకానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు త‌యారు చేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని విస్తరించడానికి ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చే వృద్ధి రంగాలలో ప‌ర్యాట‌క రంగం ఉండ‌డం వ‌ల్ల‌నే దానిపై ఫోక‌స్ పెట్టింది.

ఈ సంవత్సరం మార్చి 17న అమల్లోకి వచ్చిన తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ద్వారా, దేశీయ , అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలలో మొదటి ఐదు స్థానాల్లోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Also Read : Hyderabad Heavy Rains Sensational : కుండ‌పోత వ‌ర్షం భాగ్య‌న‌గ‌రం అస్త‌వ్య‌స్తం

Exit mobile version