హైదరాబాద్ : రూ. 200 కోట్ల స్కాంకు సంబంధించి రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ స్కాం అంతా సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ చుట్టే తిరుగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు సంపత్ నాయక్ అనే వ్యక్తి. తనే కీలకమని పేర్కొన్నారు. తన వెనుక పెద్దలు ఉన్నారని ఇలా చేస్తోందని మండిపడ్డారు. మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో మంగ్లీ చుట్టూ ముదురుతోంది వివాదం. మంగ్లీపై MAA ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు సంపత్ నాయక్. మంగ్లీ ప్రమేయంపై త్వరలో ఆధారాలు బయట పెడతామని వెల్లడించారు. బాధితుల కోసం మంగ్లీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. రమావత్ మధు, మంగ్లీ మధ్య సంబంధాలేంటి..? అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ అసలు ఎవరు దీని వెనుక ఉన్నారనేది ఇంకా తేల్చలేదు. మరో వైపు లాయర్ సుబ్బుకు టెస్ట్ చేయడం పట్ల సీఐపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
