Manda Krishna Madiga : హైదరాబాద్ : తమ న్యాయ పరమైన రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు కదం తొక్కారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జస్టిస్ ఫర్ బీసీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా రేపటి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి, ఎంఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga), ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో పాటు బీసీ అగ్ర నేత లింగం గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
Manda Krishna Madiga Participate in BC Bandh
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ర్యాలీలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు, అద్దంకి దయాకర్ , బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం మద్దతు ఇచ్చేంత వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
Also Read : US Green Cards Break : ప్రవాస భారతీయులపై గ్రీన్ కార్డ్ ఎఫెక్ట్
