Manda Krishna Madiga Strong Support : బీసీ విద్యార్థి దీక్ష‌కు ఎంఆర్పీఎస్ మ‌ద్ద‌తు

పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన మంద‌కృష్ణ మాదిగ‌

Hello Telugu - Manda Krishna Madiga Strong Support

Hello Telugu - Manda Krishna Madiga Strong Support

Manda Krishna Madiga : హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వ‌ర్యంలో న‌వంబ‌ర్ 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ లో దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ (Manda Krishna Madiga). ఇందులో భాగంగా దీక్ష‌కు సంఘీభావంగా పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. అనంత‌రం మాట్లాడారు ఎంఆర్పీఎస్ చీఫ్‌. బీసీల 42% రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని అన్నారు. సామాజిక న్యాయం కోసం జ‌రిగే అన్ని ఉద్య‌మాల‌కు, పోరాటాల‌కు తమ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మాజంలో స‌గానికి పైగా జ‌నాభా ఉన్న వారికి స‌రైన న్యాయం జ‌ర‌గాలంటే విధిగా రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Manda Krishna Madiga Support

ఈ ఒక్క ఉద్య‌మానికే కాదు అన్ని పోరాటాల‌లో కూడా తాము భాగ‌స్వామ్యం పంచుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మంద‌కృష్ణ మాదిగ‌. విద్యార్థులు శాంతియుతంగా చేసే బీసీ విద్యార్థి జేఏసీ చేప‌ట్ట‌నున్న ఈ దీక్ష‌కు
అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ ఛైర్మెన్ కొమ్మన బోయిన సైదులు, బీసీ విద్యార్థి జేఏసీ గౌరవ సలహాదారులు వలిగొండ నరసింహ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మధు యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్, ఎంఎస్ఎఫ్‌ జాతీయ నేత పాలేర్ల సుధాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : TPCC Chief Challenge to Kishan Reddy : అజ్జూకు మంత్రి ప‌ద‌వి ఇస్తే త‌ప్పేంటి..?

Exit mobile version