Manchu Lakshmi : హైదరాబాద్ : మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) సంచలనంగా మారారు. ఇటీవల ఆమె ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా సదరు జర్నలిస్ట్ తన పట్ల , తనను కించ పరిచేలా, తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా ప్రశ్నలు సంధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది మంచి పద్దతి కాదని కూడా ఆమె చిట్ చాట్ సందర్బంగా స్పష్టం చేసింది కూడా. ఈ సందర్బంగా తను ధరించిన కురచ దుస్తుల గురించి పదే పదే అడగడాన్ని తప్పు పట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. తాజాగా సదరు సీనియర్ జర్నలిస్ట్ కు బిగ్ షాక్ తగిలింది.
Manchu Lakshmi Complaints
తాను నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా ప్రమోట్ చేస్తుండగా సీనియర్ జర్నలిస్ట్ మురళి అడిగితే, గౌరవంగా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పారు. కానీ అది ఇంటర్వ్యూ కాకుండా నాపై వ్యక్తిగత దాడిగా మారిందని వాపోయింది మంచు లక్ష్మి. తన వయసు, శరీరం, దుస్తులు మొదలైన వాటిపై అవమానకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇది జర్నలిజం కాదు, కేవలం “వైరల్” అవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు నటి. తనకు జర్నలిస్టులన్నా, మీడియా అన్నా గౌరవం ఉందన్నారు. కానీ ఇలాంటి ప్రవర్తన వృత్తి పరంగా తప్పు అని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. మహిళలపై ఇలా వ్యాఖ్యలు చేయడం అనుమతిస్తే మరికొందరికి కూడా అదే విధంగా అవమానం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది.
అందుకే తాను సానుభూతి అడగడం లేదన్నారు. బాధ్యత వహించాలని కోరుతున్నానని అన్నారు. ఆయన తరచూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మంచు లక్ష్మి. కాబట్టి ఈ జర్నలిస్ట్‌పై చర్య తీసుకుని, కనీసం ఒక ఫార్మల్ వార్నింగ్ ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్‌ను కోరారు.
Also Read : Hero Yash Toxic Movie Update : యశ్ టాక్సిక్ చివరి షెడ్యూల్ స్టార్ట్
