హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నయనతార, టీవీకే గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఏకంగా తొలి రోజు రూ. 84 కోట్లు వసూలు చేయగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 40 కోట్లు వసూలు చేయడం విశేషం. దీనిని చిరంజీవి కూతురు నిర్మాణంలో భాగం పంచు కోవడం విశేషం. ప్రస్తుతం రూ. 280 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే కేవలం రెండు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
ఈ సందర్బంగా ఫుల్ ఖుష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ. బుధవారం చిత్రం బృందంతో పాటు మెగా ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేశారు. తాను నటించిన మన శంకర వర ప్రసాదు గారు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో చెప్పలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా మెగా మూవీ దుమ్ము రేపుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కాసులు కొల్ల కొట్టేందుకు దూసుకు వెళుతోంది. ఇదిలా ఉండగా ఈ కేక్ కట్ చేసే కార్యక్రమంలో చిరంజీవి, వెంకటేశ్, అనిల్ రావిపూడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
