Mamata Banerjee : న్యూఢిల్లీ – దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబు నాయుడు (CM Chandrababu). ఆయన ఆస్తులు ఏకంగా రూ. 931 కోట్లు కావడం విశేషం. ఎవరూ ఊహించని రీతిలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం పెమా ఖండు 2వ ప్లేస్ లో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 332 కోట్లు . ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆస్తులు రూ. 51గా తేల్చింది ఏడీఆర్ సంస్థ. అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో వీరికి చోటు దక్కగా అత్యంత అత్యల్ప ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి నిలిచారు. ఆమె ఆస్తులు కేవలం రూ. 15.38 లక్షలు మాత్రమే కావడం గమనార్హం.
Mamata Banerjee is the Poorest CM in India
ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆస్తులు కూడా ప్రకటించారు. తన ఆస్తులు రూ. 55.24 లక్షలు మత్రమేనని పేర్కొంది ఏడీఆర్. ఇక సీపీఎం పార్టీకి చెందిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆస్తులు రూ. 1.18 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులలో భజన్ లాల్ శర్మ (రాజ్ ) రూ. 1.46 కోట్లు ఉండగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆస్తులు రూ. 1.54 కోట్లు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు రూ. 1.64 కోట్లు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆస్తులు రూ. 1.97 కోట్లు ఉన్నాయని తెలిపింది. ఇక ఒడిశా సీఎం మోహన్ మాఝీ ఆస్తులు రూ. 1.97 కోట్లు ఉండగా ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ఆస్తులు రూ. 3.80 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. వీరి ఆస్తులు ఎన్నికల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా సేకరించినట్లు తెలిపింది. 12 మందిపై క్రిమినల్ కేసులు ఉండడం విశేషం.
Also Read : AP Govt Interesting Update : మున్సిపల్ కార్మికులకు రూ. 10 లక్షల బీమా
